షియోమీ ఎంఐ ఎ3 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదరహో..!


Wed,August 21, 2019 01:09 PM

షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ3ని ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.08 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను అందిస్తున్నారు. దీనికి గాను ఆండ్రాయిడ్ క్యూ అప్‌డేట్‌ను కూడా ఇవ్వనున్నట్లు షియోమీ తెలిపింది. ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా.. గతంలో ఈ ఫీచర్‌తో వచ్చిన ఫోన్ల కన్నా ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ డిటెక్షన్ ఏరియా 15 శాతం ఎక్కువగా ఉంటుంది.

షియోమీ ఎంఐ ఎ3 ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ కలిగిన కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా 8, 2 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మరో రెండు కెమెరాలను కూడా అందిస్తున్నారు. దీని వల్ల నాణ్యమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. దీంతో అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను తీసుకోగలిగేలా ఏఐ బ్యూటిఫై మోడ్‌ను ఈ ఫోన్ కెమెరా యాప్‌లో అందిస్తున్నారు.

ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 3డీ కర్వ్‌డ్ గ్లాస్ బ్యాక్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల దీనికి అద్భుతమైన లుక్ వచ్చింది. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్‌ను కూడా ఈ బ్యాటరీకి అందిస్తున్నారు. ఫోన్‌తోపాటు కేవలం 10 వాట్ల చార్జర్ మాత్రమే వినియోగదారులకు లభిస్తుంది.షియోమీ ఎంఐ ఎ3 ఫీచర్లు...


* 6.08 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై
* 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4030 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్

షియోమీ ఎంఐ ఎ3 స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్, గ్రే కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999 గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో ఈ నెల 23వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.750 క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే డబుల్ డేటా అందిస్తారు.

1616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles