ఎంఐ ఎ2, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, రెడ్‌మీ వై2 ధరలను తగ్గించిన షియోమీ


Sat,November 17, 2018 06:56 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన ఎంఐ ఎ2, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, రెడ్‌మీ వై2 ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్లు తగ్గిన ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి. ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.1వేయి తగ్గి రూ.15,999 ధరకు లభిస్తుండగా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర కూడా రూ.1వేయి తగ్గింది. ఈ వేరియెంట్‌ను రూ.18,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్‌మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.1వేయి తగ్గి రూ.11,999 ఉండగా, రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.1వేయి తగ్గి రూ.13,999 ధరకు, 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.1వేయి తగ్గి రూ.15,999 ధరకు లభిస్తున్నాయి. అన్ని ప్లాట్‌ఫాంలలోనూ ఈ ఫోన్లు లభిస్తుండగా, ఏ విధంగా ఈ ఫోన్లను కొనుగోలు చేసినా డిస్కౌంట్ ధర లభిస్తుంది.

6701

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles