ఈ నెల 24న షియోమీ ఎంఐ ఎ2, ఎ2 లైట్ ఫోన్లు విడుదల


Sun,July 15, 2018 09:32 AM

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు ఎంఐ ఎ2, ఎంఐ ఎ2 లైట్‌లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. రూ.23,950 ప్రారంభ ధరకు ఎంఐ ఎ2 లభ్యం కానుండగా, రూ.19,350 ప్రారంభ ధరకు ఎంఐ ఎ2 లైట్‌ను విక్రయించనున్నారు. ఈ రెండు ఫోన్లలోనూ పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందివ్వనున్నారు.

షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు...


5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

షియోమీ ఎంఐ ఎ2 లైట్ ఫీచర్లు...


5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3350

More News

VIRAL NEWS