రేపు విడుద‌ల కానున్న షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్


Tue,February 19, 2019 08:32 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంఐ 9 ను రేపు విడుద‌ల చేయ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు చైనాలో ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయ‌నున్నారు. ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 48, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 12, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9.0 పై, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్ ధ‌ర రూ.34,700 గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ ఫోన్ గురించిన పూర్తి వివ‌రాలు రేపు తెలుస్తాయి.

6076

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles