షియోమీ నుంచి ఎంఐ9 స్మార్ట్‌ఫోన్


Sat,February 16, 2019 03:07 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఎంఐ 9 ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో వెనుక భాగంలో మూడు కెమెరాల‌ను అమ‌ర్చిన‌ట్లు స‌మాచారం. 48 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు 12 మెగాపిక్స‌ల్ టెలిఫోటో లెన్స్‌, 16 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను స‌ఫైర్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చార‌ని తెలుస్తున్న‌ది. అలాగే ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరా అమ‌ర్చిన‌ట్లు తెలిసింది. అయితే ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో తెలిసే అవకాశం ఉంది.

5063

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles