అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్


Wed,February 20, 2019 03:46 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంఐ 9 ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 6.39 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌లను అమ‌ర్చినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48, 12, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

ఇక షియోమీ ఈ ఫోన్‌కు గాను 12 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్రపంచంలోనే ఇంత భారీ ర్యామ్ ఉన్న ఫోన్ ఇదే కావ‌డం విశేషం. కాగా ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.31,725 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.34,900 ధ‌ర‌కు, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.42,300 ధ‌ర‌కు ఈ నెల 26వ తేదీ నుంచి ల‌భ్యం కానున్నాయి.

షియోమీ ఎంఐ9 ఫీచ‌ర్లు...


6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌.

2516

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles