షియోమీ ఎంఐ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Wed,February 20, 2019 06:36 PM

షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంఐ9 ఎస్ఈని ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 5.97 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48, 8, 13 మెగాపిక్స‌ల్ ట్రిపుల్‌ కెమెరాలు, ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరా ఉన్నాయి. బ్లూ, వ‌యోలెట్‌, డార్క్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌ల కాగా దీనికి చెందిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.21,150 ధ‌ర‌కు, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.24,330 ధ‌ర‌కు మార్చి 1వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి.

షియోమీ ఎంఐ 9 ఎస్ఈ ఫీచ‌ర్లు...


5.97 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3070 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

2404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles