షియోమీ నుంచి ఎంఐ8 యూత్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్


Mon,September 17, 2018 03:01 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8 యూత్ ఎడిషన్‌ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్, వైట్, బ్లూ, రెడ్, గ్రే, సిల్వర్, గ్రీన్, బ్లూ-వయోలెట్, పర్పుల్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

షియోమీ ఎంఐ 8 యూత్ ఎడిషన్ ఫీచర్లు...


6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles