ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో షియోమీ ఎంఐ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్


Wed,September 19, 2018 04:18 PM

ఎంఐ 8 ప్రొ పేరిట షియోమీ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. రూ.33,945 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఎంఐ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు వివో ఫోన్లలో ఈ ఫీచర్ లభిస్తుండగా ఆ జాబితాలోకి షియోమీ కూడా వచ్చి చేరింది. ఇక ఈ ఫోన్‌లో 6.21 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినందున ఈ ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ కూడా ఈఫోన్‌లో ఉంది.

షియోమీ ఎంఐ 8 ప్రొ ఫీచర్లు...


6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, ఫాస్ట్ చార్జింగ్.

1628

More News

VIRAL NEWS

Featured Articles