షియోమీ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Wed,September 19, 2018 07:15 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్‌ను చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్‌కు చెందిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,835 ధరకు లభ్యం కానుండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,020 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.21,200 ధరకు లభ్యం కానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు విక్రయాలు ప్రారంభమవుతాయి.

షియోమీ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు.

షియోమీ ఎంఐ 8 లైట్ యూత్ ఎడిషన్ ఫీచర్లు...


6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

3539

More News

VIRAL NEWS

Featured Articles