షియోమీ ఫోన్ యూజ‌ర్ల కోసం ప‌బ్‌జి మొబైల్ లాంటి గేమ్‌..!


Sat,January 19, 2019 03:32 PM

మ‌న దేశంలో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని కోట్ల మంది ఈ గేమ్‌ను ఆడుతున్నారు. చాలా మంది ఈ గేమ్‌తో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్స్ పెట్టి డ‌బ్బులు కూడా ఆర్జిస్తున్నారు. అయితే ఈ గేమ్‌ను దృష్టిలో ఉంచుకుని షియోమీ కూడా త‌న ఎంఐ, రెడ్‌మీ ఫోన్ల‌ను వాడ‌వారి కోసం స‌ర్‌వైవల్ గేమ్ పేరిట ఓ నూత‌న గేమ్‌ను డెవ‌లప్ చేసింది. ప్ర‌స్తుతం ఈ గేమ్ కేవ‌లం షియోమీ ఫోన్ల‌ను వాడే యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఎంఐ యాప్ స్టోర్‌లో ల‌భిస్తున్న‌ది. ఈ గేమ్ సైజ్ 185 ఎంబీ కాగా ఇందులోనూ ప‌బ్‌జి మొబైల్‌లాగే యూజ‌ర్లు గేమ్ ఆడాల్సి ఉంటుంది. కాక‌పోతే దీనికి సైంటిఫిక్ ట‌చ్ ఇచ్చారు. ఇక ఈ గేమ్ సైజ్ చాలా త‌క్కువ గ‌నుక ప‌బ్‌జి మొబైల్ గేమ్ త‌ర‌హాలో 3డీ గ్రాఫిక్స్ ఇందులో ఉండ‌వు. కానీ ఇది ప్ర‌స్తుతం డెవ‌ల‌పింగ్ స్టేజ్‌లో ఉంది కనుక రాబోయే రోజుల్లో మ‌రిన్ని హంగుల‌తో ఈ గేమ్‌ను తీర్చిదిద్ద‌నున్నారు. ఇక గేమ్ యూజ‌ర్ల‌కు యాప్ స్టోర్‌లో ల‌భ్యం కాక‌పోతే https://moddroid.com/xiaomi-survival-game.html?download లింక్‌ను ఉప‌యోగించి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అలాగే డెవ‌ల‌ప‌ర్లు అయితే ఈ గేమ్‌కు బీటా టెస్ట‌ర్‌గా కూడా మారే అవ‌కాశం క‌ల్పించారు. అందుకు గాను యూజ‌ర్లు https://docs.google.com/forms/d/e/1FAIpQLSc5hAsLP-FDGP-HnPAdiHw2MPnbJCsmakHTm2taHdhC4taljA/viewform లింక్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

2126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles