స్ట్రెస్ రిలీఫ్ క్యూబ్‌ను విడుద‌ల చేసిన షియోమీ


Tue,January 22, 2019 04:13 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. ఎంఐ ఫోక‌స్ క్యూబ్ పేరిట ఓ నూత‌న లైఫ్ స్టైల్ ప్రోడ‌క్ట్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. దీన్ని అధునాత‌న మోల్డింగ్ టెక్నాల‌జీతో త‌యారు చేశారు. స్మూత్ క‌ర్వ్‌డ్ ఎడ్జ్‌ల‌ను ఈ క్యూబ్ క‌లిగి ఉంది. దీని వ‌ల్ల యూజర్ల‌కు సౌక‌ర్య‌వంత‌మైన గ్రిప్ ల‌భిస్తుంది. ఈ క్యూబ్‌ను పాకెట్ల‌లో కూడా ప‌ట్టే విధంగా సింపుల్‌గా త‌యారు చేశారు. ఈ ఎంఐ ఫోకస్ క్యూబ్ ధ‌ర రూ.199 కాగా ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఈ క్యూబ్‌తోపాటు ఎంఐ రోల‌ర్ బాల్ పెన్ కు గాను రీఫిల్‌ను కూడా షియోమీ లాంచ్ చేసింది. ఈ రీఫిల్ ధర రూ.119 కాగా దీన్ని కూడా ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles