స్మార్ట్‌ఫోన్ యూజర్లకు లోన్లు ఇస్తున్న షియోమీ.. ఎంఐ క్రెడిట్ యాప్ విడుదల..


Tue,December 3, 2019 02:16 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ఎంఐ క్రెడిట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు రూ.1 లక్ష వరకు లోన్లను పొందవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్రమే ఈ యాప్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇక ఇందులో ఎంఐ అకౌంట్ ఉన్నవారు లేదా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకుని తమ కేవైసీ వివరాలతో లోన్ పొందవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులకు లోన్లు ఇచ్చేందుకు షియోమీ ఇప్పటికే ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్ విద్య, జెస్ట్ మనీ తదితర ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం అయింది.

కాగా ఎంఐ క్రెడిట్ యాప్ ఇప్పటికే 10 రాష్ర్టాల యూజర్లకు అందుబాటులో ఉండగా, ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించామని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో దీన్ని లాంచ్ చేశామని, 18 సంవత్సాలకు పైబడి వయస్సు ఉన్నవారు తమ కేవైసీ వివరాలతో లోన్ పొందవచ్చని, వడ్డీ 1.35 శాతం వరకు ఉంటుందని షియోమీ తెలిపింది. ఇక తీసుకున్న రుణం మొత్తాన్ని 91 రోజుల నుంచి 3 ఏళ్ల లోపు వినియోగదారులు చెల్లించవచ్చని షియోమీ తెలియజేసింది.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles