ఇక‌పై 17 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జ్ అవుతుంది.. షియోమీ కొత్త టెక్నాల‌జీ ..!


Tue,March 26, 2019 04:31 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ కేవ‌లం 17 నిమిషాల్లోనే 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్న ఫోన్‌ను ఫుల్ చార్జింగ్ చేసే నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. షియోమీకి చెందిన 100 వాట్ల సూప‌ర్ చార్జ్ ట‌ర్బో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాల‌జీ స‌హాయంతో 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కెపాసిటీ ఉన్న ఫోన్‌ను 0 నుంచి 100 శాతం చార్జింగ్ చేసేందుకు కేవ‌లం 17 నిమిషాలు మాత్ర‌మే ప‌డుతుంది. ఈ మేర‌కు ఈ వివ‌రాల‌ను షియోమీ కో ఫౌండ‌ర్ బిన్ లిన్ ఓ వీడియోలో వెల్ల‌డించారు. అయితే ప్ర‌స్తుతం ఈ ప‌రిజ్ఞానం కేవలం ప‌రీక్ష ద‌శ‌లోనే ఉంద‌ని త్వ‌ర‌లోనే యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని షియోమీ తెలిపింది. కాగా ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఒప్పో, హువావేల‌కు చెందిన ప‌లు ఫోన్ల‌లో ఈ త‌ర‌హా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. కాక‌పోతే వాటిలో కేవ‌లం 50, 55 వాట్ల సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాల‌జీ మాత్ర‌మే ఉండ‌గా, షియోమీ ఏకంగా 100 వాట్ల సూప‌ర్ చార్జ్ ట‌ర్బో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేయ‌డం విశేషం.

5318

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles