శాంసంగ్ షోరూమ్‌లో షియోమీ ఇండియా బాస్.. దీని మర్మమేమి?


Fri,February 22, 2019 05:13 PM

శాంసంగ్, షియోమీ వ్యాపార ప్రత్యర్థులు. ముఖ్యంగా ఇండియాలో రెండు బ్రాండ్ల మధ్య తీవ్రపోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అలాంటింది షియోమీ ఇండియా విభాగం అధిపతి శాంసంగ్ షోరూమ్‌కు వెళ్లడం ఇప్పుడు పెద్ద వార్త అయికూర్చున్నది. షియోమీ ఇండియా హెడ్, గ్లోబల్ వీపీ అయిన మనుకుమార్ జైన్ దక్షిణఢిల్లీలోని శాంసంగ్ స్టోర్‌కు వెళ్లారు. స్టోర్ ఉద్యోగులు, కొందరు ఇతర వ్యాపారవేత్తలు బ్లూడెనిమ్, నల్ల టీషర్టు ధరించిన జైన్‌ను వెంటనే గుర్తుపట్టారు. సెల్లు కెమెరాలను క్లిక్కుమనిపించారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాంసంగ్ ఆన్‌లైన్‌లో మాత్రమే అమ్మేందుకు గెలాక్సీ-ఎం సిరీస్‌ను లాంచ్ చేయడంపై జైన్ విమర్శలు చేశారు. అంతేకాకుండా దానికి పోటీగా రెడ్‌మీ నోట్ -7 లాంచ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో షియోమీ ఇండియా బాస్ శాంసంగ్ స్టోర్‌లోకి గుట్టుచప్పుడు కాకుండా దూరడంపై సహజంగానే ఆసక్తి వ్యక్తమవుతున్నది. అయితే ఇంతవరకు శాంసంగ్ మాత్రం షియేమీ గురించి మాట్లాడలేదు. శాంసంగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మొబైల్ మార్కెటింగ్ హెడ్ రంజీవ్‌జీత్‌సింగ్ షియోమీకి చురకలు అంటించారు. మేము వినియోగదారుల గురించి మాట్లాడుతాము. కానీ షియోమీ మా గురించి మాట్లాడుతున్నది. ఇందుకు వారికి ధన్యవాదాలు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

2037

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles