12జీబీ ర్యామ్‌తో వ‌స్తున్న షియోమీ బ్లాక్ షార్క్ 2 గేమింగ్ ఫోన్


Wed,March 13, 2019 01:38 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న బ్లాక్ షార్క్ 2 గేమింగ్ ఫోన్‌ను ఈ నెల 18వ తేదీన విడుద‌ల చేయనుంది. ఇందుల స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్, లిక్విడ్ కూలింగ్ 3.0 టెక్నాల‌జీ, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌కు చెందిన ఇత‌ర ఫీచ‌ర్ల వివ‌రాలు తెలియ‌లేదు. త్వ‌ర‌లో పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల‌ను షియోమీ ప్ర‌క‌టించ‌నుంది. ఇక ఈ ఫోన్‌ను ముందుగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. త‌రువాతే ఇత‌ర దేశాల్లోని యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుంది. కాగా గేమింగ్ సిరీస్‌లో షియోమీ విడుద‌ల చేస్తున్న రెండో ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఈ ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 6టి, గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌కు పోటీనిస్తుంద‌ని భావిస్తున్నారు.

1914

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles