వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ కు 30 ఏళ్లు పూర్తి..!


Tue,March 12, 2019 04:16 PM


ఇంట‌ర్నెట్ లేని ఈ ప్ర‌పంచాన్ని మ‌నం ప్ర‌స్తుతం ఊహించ‌గ‌ల‌మా ? అస‌లే ఊహించ‌లేం. దాంతో ఎన్ని పనులు జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలుసు. ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర్నుంచీ రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ఇంట‌ర్నెట్ మన‌లో ఒక భాగం అయిపోయింది. ఈ క్ర‌మంలోనే తొలిసారిగా వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ సేవ‌లు ప్రారంభ‌మై సరిగ్గా నేటికి 30 సంవ‌త్స‌రాలు విజ‌య‌వంతంగా పూర్త‌య్యాయి. అందుక‌నే సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త‌న సెర్చ్ సైట్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ కు చెందిన డూడుల్‌ను ఇవాళ ఉంచింది.

world wide web completes 30 years
1989వ సంవ‌త్స‌రం మార్చి 12వ తేదీన టిమ్ బెర్న‌ర్స్ లీ మొద‌టి సారిగా వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ ను అభివృద్ధి చేశారు. ఆ తరువాత 1993 ఏప్రిల్ నెల నుంచి వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో టిమ్ బెర్న‌ర్స్ లీ వ‌ర‌ల్డ్ వైబ్ వెబ్‌కు 30 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప్ర‌తి ఇంట‌ర్నెట్ యూజ‌ర్ త‌న డేటాను సుర‌క్షితంగా ఉంచుకోవాల‌ని అన్నారు. అలాగే నెట్‌లో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, దేన్నీ అంత తేలిగ్గా న‌మ్మ‌వ‌ద్ద‌ని, మోస‌పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.1302

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles