ఆ చిత్రాలను మహిళలే ఎక్కువగా చూస్తున్నారట..!


Wed,March 22, 2017 05:35 PM

కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు... ఇలా డివైస్ ఏదైనా వాటిలో అశ్లీల చిత్రాలను ఎక్కువగా మహిళలే చూస్తున్నారట. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు కేవలం మగవారు మాత్రమే అలాంటి చిత్రాలను ఎక్కువ‌గా చూసే వారని అందరూ భావించేవారు. కానీ సీన్ రివర్సయింది. అశ్లీల చిత్రాలను చూసేవారిలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువ శాతం ఉన్నారట. 2017 ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు న‌మోదైన గ‌ణాంకాల ప్ర‌కారం ఓ పోర్న్ వెబ్‌సైట్ వెల్లడించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు... ఇలా డివైస్ ఏదైనప్పటికీ వాటిల్లో అశ్లీల చిత్రాలను చూస్తున్న మహిళల శాతం 80గా ఉంది. పురుషులకైతే ఇది 69 శాతంగా ఉంది. అంటే పురుషుల కన్నా 11 శాతం ఎక్కువ మంది మహిళలు పోర్న్ వీడియోలు చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇదే రేటు యూకేలో ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడ 86 శాతం మంది మహిళలు పోర్న్ వీడియోలు చూస్తున్నారట.
porn-stats-2016-17
అయితే ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ వీడియోలు చూస్తున్న మహిళల్లో 72 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారానే వీక్షిస్తుండడం గమనార్హం. వీరిలో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు అత్యధికంగా ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తుండగా, వయస్సు పెరుగుతున్నకొద్దీ కంప్యూటర్‌లో పోర్న్ వీడియోలను చూసే వారు పెరుగుతుండడం గమనించదగిన విషయం. అశ్లీల చిత్రాలను చూస్తున్న మొత్తం మహిళల్లో కేవలం 28 శాతం మంది మాత్రమే కంప్యూటర్లలో ఆ చిత్రాలను వీక్షిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో పోర్న్ వీడియోలను చూస్తున్న వారే ఎక్కువ కావడం విశేషం.

13333

More News

VIRAL NEWS