వితింగ్స్ పల్స్ హెచ్‌ఆర్ ఫిట్‌నెస్ ట్రాకర్ విడుదల


Thu,November 15, 2018 03:01 PM

వితింగ్స్.. పల్స్ హెచ్‌ఆర్ పేరిట ఓ నూతన ఫిట్‌నెస్ ట్రాకర్‌ను ఇవాళ విడుదల చేసింది. ఈ ట్రాకర్ యూజర్ల ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లను తెలియజేస్తుంది. అలాగే టైం, డేట్, డైలీ గోల్ ప్రోగ్రెస్, క్యాలరీలు, హార్ట్ రేట్ సెన్సార్, జీపీఎస్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో ఉన్నాయి.

ప్రతి 10 నిమిషాలకు ఒక సారి ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ యూజర్‌కు చెందిన హార్ట్ రేట్‌ను కొలుస్తుంది. ఈ వివరాలను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ఫిట్, హెల్త్ మేట్, యాపిల్ హెల్త్, మై ఫిట్‌నెస్ పాల్ తదితర యాప్స్‌కు ఈ ట్రాకర్‌లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ట్రాకర్‌లో ఉన్న బ్యాటరీ 20 రోజుల వరకు వస్తుంది. అలాగే ఇందులో వాటర్ రెసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.9,360 ధరకు ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ డిసెంబర్ 5వ తేదీ నుంచి అమెజాన్‌లో వినియోగదారులకు లభ్యం కానుంది.

706

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles