రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు!


Mon,December 31, 2018 04:48 PM

జనవరి 1, 2019 నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పని చేయదని కంపెనీ వెల్లడించింది. ఈ పని చేయని ఫోన్లలో అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల పాత వెర్షన్లు ఉన్నాయి. నోకియా ఎస్40తోపాటు విండోస్ ఫోన్ 7, ఐఫోన్ ఐఓఎస్ 6, నోకియా సింబియాన్ 60లలో మంగళవారం నుంచి వాట్సాప్ పని చేయదు. ఇక ఆండ్రాయిడ్ ఓఎస్‌లో వెర్షన్ 2.3.7, అంతకంటే ముందు వెర్షన్లు ఉన్న ఫోన్లలో, ఐఓఎస్ 7, అంతకన్నా ముందు వెర్షన్లు ఉన్న ఐఫోన్లలో 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ పని చేయదని కంపెనీ స్పష్టం చేసింది. ఐఓఎస్ 7 ప్రస్తుతం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్‌లలో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను అందుకోలేవని వాట్సాప్ చెప్పింది. ఈ వెర్షన్ ఫోన్లు వాడేవాళ్లు కొత్త వెర్షన్‌లకు అప్‌డేట్ కావాలని సూచించింది. ఆండ్రాయిడ్ అయితే కనీసం 4+, ఐఫోన్ అయితే ఐఓఎస్ 7+, విండోస్ అయితే కనీసం 8.1+ వెర్షన్లు ఉండాలని వాట్సాప్ తెలిపింది. జియో ఫోన్, జియో ఫోన్ 2లలోనూ వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

8291

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles