పాత ఐఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్న వాట్సాప్..!


Sun,September 23, 2018 10:59 AM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ ఈ మధ్యే తన నూతన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ పాత ఐఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనుంది. ముఖ్యంగా ఐఓఎస్ 7.1.2 అంత కన్నా తక్కువ ఐఓఎస్ వెర్షన్ ఉన్న ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు. అయితే ఇప్పటికప్పుడు మాత్రం ఈ నిర్ణయం అమలు కాదు. ఫిబ్రవరి 1, 2020 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది వాట్సాప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అప్పటి నుంచి పైన చెప్పినట్లుగా ఐఓఎస్ 7.1.2 అంతకన్నా తక్కువ ఐఓఎస్ వెర్షన్ ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అయితే వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాత ఐఫోన్లను వాడుతున్న యూజర్లపై పెద్దగా ప్రభావం పడదని, ఆ ఫోన్లను వాడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందు వల్ల తమ నిర్ణయం వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోదని వాట్సాప్ తెలిపింది.

2088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles