HomeLATEST NEWSWhatsapp to roll out new feature by which users can watch videos directly in notifications

వాట్సాప్‌లో త్వరలోనే అదిరిపోయే ఫీచర్

Published: Fri,November 23, 2018 02:52 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అప్‌డేట్ తెస్తూనే ఉంటుంది. తాజాగా ఇలాంటిదే మరో అప్‌డేట్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ కొత్త అప్‌డేట్ కారణంగా యూజర్ల ఇక తమకు వచ్చిన వీడియోలను నోటిఫికేషన్‌లో చూసుకునే వీలుంటుంది. ఇప్పటివరకు మెసేజ్ పంపిన వ్యక్తి, దాని చిన్న ప్రీవ్యూ మాత్రమే కనిపించేది. ఆ వీడియో చూడటానికి కచ్చితంగా యాప్‌లోకి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో వీడియోలను కూడా నోటిఫికేషన్‌లోనే చూసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం 2.18.102.5 వర్షన్‌లో ఉన్న ఐఓఎస్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు వాబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. కొత్త ఫీచర్ ద్వారా పుష్ నోటిఫికేషన్స్‌లోనే వీడియో ప్రీవ్యూ చూసే వీలు కలుగుతుంది. అంటే ఒకవేళ స్క్రీన్ లాక్ ఉన్నా కూడా నేరుగా ఆ వీడియోను చూడొచ్చు.



3109
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology