త్వరలోనే వాట్సాప్‌లో పేమెంట్ ఆప్షన్ రానున్నది. దీని ద్వారా యూజర్లు ఫండ్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. చాలా రోజులుగా ఈ ఫీచర్‌పైనే పనిచేస్తున్న వాట్సాప్.. అతి త్వరలోనే దీనిని ఇంట్రడ్యూస్ చేయనుంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ను తొలిసారి ఇండియాలోనే ప్రారంభించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దీనిని వాట్సాప్ పేగా పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఫైనల్ టెస్టింగ్‌లో ఉంది. ఈ యూపీఐ ఆధారిత పేమెంట్ ఫీచర్ కోసం వాట్సాప్ ఇప్పటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో చేతులు కలిపినట్లు సమాచారం. వాట్సాప్ చాట్‌లో అటాచ్మెంట్ ఆప్షన్ కింద రూపీ సింబల్‌తో ఈ ఫీచర్ రానున్నది. దీని ద్వారా ఒకే స్టెప్‌లో ఫ్రెండ్స్‌కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అమౌంట్, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు. చాట్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేకుండా అటాచ్మెంట్ ఆప్షన్ కిందే రూపీ సింబల్ ఉంచుతున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఇప్పటికే వాట్సాప్‌కు పోటీగా ఉన్న వీచాట్‌లో పేమెంట్ ఆప్షన్ లాంచ్ అయింది. వాట్సాప్ ఈ పేమెంట్స్ ఆప్షన్‌ను విజయవంతంగా లాంచ్ చేయగలిగితే.. పేటీఎం, మొబిక్విక్‌లాంటి పోటీదారులకు కష్టకాలమే.