వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త ఫీచర్


Sun,November 11, 2018 02:35 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రివ్యూ పేరిట రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తాము వాట్సాప్ పంపుకునే ఏ మెసేజ్‌నైనా ముందుగా ప్రివ్యూ చూడవచ్చు. అవసరం అనుకుంటే అందులో మార్పులు చేర్పులు చేయవచ్చు. అంతేకాకుండా ఒకరికన్నా ఎక్కువ మందికి ఆ మెసేజ్‌ను పంపేటట్లయితే ఆ జాబితాలోంచి యూజర్లను తీసేయవచ్చు లేదా మరికొందరికి యాడ్ చేయవచ్చు. ఇక ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, టెక్ట్స్ సందేశాలు... ఇలా ఏ తరహా మెసేజ్‌నైనా పంపేముందు ప్రివ్యూ చూసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించనుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నారు. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. గ్రూప్ మెసేజ్‌లను ఎక్కువగా పంపుకునే యూజర్లకు ఈ ఫీచర్ బాగా పనికొస్తుందని వాట్సాప్ చెబుతున్నది.

4078

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles