వాట్సాప్ డేటా బ్యాకప్ తీసుకోండి. లేదంటే డిలీట్ అవుతుంది..!


Wed,November 14, 2018 09:42 AM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు డేటాను బ్యాకప్ తీసుకోవాలని సూచిస్తోంది. గూగుల్ డ్రైవ్‌లో ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు స్టోర్ అయి ఉన్న డేటాను వెంటనే బ్యాకప్ తీసుకోవాలని, లేదంటే ఆ డేటా యూజర్లకు లభ్యం కాదని వాట్సాప్ సూచించింది. ఇప్పటికే ఈ విషయంపై వాట్సాప్ గతంలోనే ప్రకటించగా, ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అమలు పరుస్తోంది. ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు స్టోర్ అయి ఉన్న డేటాను వాట్సాప్ గూగుల్ డ్రైవ్ నుంచి తొలగించే పనిలో పడింది. కనుక చాలా పాత వాట్సాప్ డేటా గూగుల్ డ్రైవ్‌లో ఉంటే వెంటనే దాన్ని బ్యాకప్ తీసుకోవాలని వాట్సాప్ తన యూజర్లకు తెలిపింది.

1134

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles