వాట్సాప్‌లో వస్తున్న మరో ఆకట్టుకునే ఫీచర్..!


Sat,January 13, 2018 01:21 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో మరోకొత్త ఫీచర్ యూజర్లకు లభ్యం కానుంది. దీని వల్ల గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని పూర్తిగా గ్రూప్ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. కేవలం అడ్మిన్‌గా మాత్రమే తొలగించవచ్చు. దీంతో అడ్మిన్‌గా తొలగింపబడిన వాట్సాప్ యూజర్ కేవలం ఆ గ్రూప్‌లో సభ్యుడిగా మాత్రమే ఉంటాడు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ ఫీచర్ లభ్యం కానుంది. అయితే ఏదైనా గ్రూప్‌కు చెందిన ఒక అడ్మిన్‌ను తొలగించాలంటే ముందుగా మరొకరు అడ్మిన్ కావల్సి ఉంటుంది. అలా అడ్మిన్ అయ్యాకే మరో అడ్మిన్‌ను తొలగించవచ్చు. ఇందుకు గాను గ్రూప్ అడ్మిన్ కింద డిస్మిస్ బటన్‌ను వాట్సాప్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఒక అడ్మిన్ మరో అడ్మిన్‌ను వాట్సాప్ గ్రూప్‌నకు అడ్మిన్‌గా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్‌లో త్వరలో గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్స్ ఇవ్వనున్నారు. గ్రూప్‌లోని సభ్యులెవరైనా అభ్యంతరకరంగా టెక్ట్స్ సందేశాలు, ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు, డాక్యుమెంట్స్ పంపితే వారిని నియంత్రించే అధికారాన్ని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఇవ్వనున్నారు. అతి త్వరలో ఈ ఫీచర్లు వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

6908

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles