వాట్సాప్‌లో మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లు..!


Mon,December 11, 2017 03:33 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉన్నది. అందులో భాగంగానే త్వరలో మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనుంది. ప్రైవేట్ రిప్లై, పీఐపీ మోడ్, ట్యాప్ టు అన్‌బ్లాక్ ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తేనుంది. ప్రైవేట్ రిప్లై ఫీచర్ ద్వారా గ్రూప్‌లో చాటింగ్ చేస్తున్న యూజర్లు వెనక్కి రాకుండానే అదే గ్రూప్‌లో ఉన్న ఎవ‌రైనా యూజర్‌కు ప్రైవేట్‌గా మరో విండోలో మెసేజ్‌లు పంపవచ్చు. అందుకు గాను గ్రూప్ చాట్ విండోలో ఉండే రిప్లై బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇక మరో ఫీచర్ అయిన పీఐపీ (పిక్చర్ ఇన్ పిక్చర్) మోడ్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు వేరే కొత్త విండోలో అవి దర్శనమిస్తాయి.

వాట్సాప్‌లో రానున్న ట్యాప్ టు అన్‌బ్లాక్ ఫీచర్ ద్వారా యూజర్ పేరుపై ప్రెస్ చేసి పట్టుకుంటే వారిని వాట్సాప్‌లో అన్‌బ్లాక్ చేసేందుకు వీలుంటుంది. అదేవిధంగా ఐఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అయితే ఈ ఫీచర్లన్నీ ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో పలువురు ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాట్సాప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఫీచర్లు యూజర్లందరికీ అందుబాటులోకి వస్తాయి.

3042

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles