వాట్సాప్‌లో ఇక‌పై న‌కిలీ ఇమేజ్‌ల‌ను గుర్తించ‌డం సులువే..!


Thu,March 14, 2019 05:20 PM

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. సెర్చ్ ఇమేజ్ పేరిట ల‌భ్యం కానున్న ఆ ఫీచ‌ర్ సహాయంతో యూజ‌ర్లు త‌మ‌కు వాట్సాప్ మెసేజ్‌ల‌లో వ‌చ్చే ఇమేజ్‌లు అస‌లువో, న‌కిలీవో చాలా సుల‌భంగా గుర్తించ‌వచ్చు. అందుకు గాను యూజ‌ర్లు త‌మ‌కు వ‌చ్చిన మెసేజ్‌పై ప్రెస్ చేసి ప‌ట్టుకుని అనంత‌రం వ‌చ్చే విండోలో సెర్చ్ ఇమేజ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. దీంతో ఆ ఇమేజ్ నేరుగా గూగుల్‌లో సెర్చ్ అవుతుంది. ఈ క్ర‌మంలో ఆ ఇమేజ్ అస‌లుదో, న‌కిలీదో యూజ‌ర్ల‌కు ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఈ సెర్చ్ ఇమేజ్ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌స్తుతం అంత‌ర్గ‌తంగా ప‌రిశీలిస్తున్న‌ది. త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది..!

1619

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles