జియో ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. వారికి ఇప్పుడు వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జూలైలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో జియో ఫోన్‌కు గాను యూట్యూబ్, వాట్సాప్ యాప్‌లను ఆగస్టు 15న అందుబాటులోకి తెస్తామని జియో ప్రకటించింది. కానీ ఒక నెల ఆలస్యంగా వాట్సాప్ యాప్‌ను జియో ఫోన్‌కు అందుబాటులోకి తెచ్చారు. జియో ఫోన్లో ఉన్న కైఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వాట్సాప్‌ను ప్రత్యేకంగా డెవలప్ చేశారు.
జియో ఫోన్, జియో ఫోన్ 2 ఫోన్లను వాడుతున్న వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం తమ తమ ఫోన్ నంబర్లను వెరిఫై చేసుకోవడం ద్వారా జియో ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే మరోవైపు నోకియా విడుదల చేసిన తన 8110 4జీ ఫోన్ కూడా 4జీ ఫీచర్ ఫోనే కాగా, అందులోనూ జియో ఫోన్ తరహాలో కైఓఎస్ ఉంది. కనుక అందులోనూ వాట్సాప్ యాప్ లభ్యమయ్యే అవకాశం ఉంది. కానీ దీనిపై ఎలాంటి వివరాలను నోకియా వెల్లడించలేదు. కాకపోతే త్వరలోనే ఈ ఫోన్‌కు కూడా వాట్సాప్ ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది.