వచ్చేసింది.. వాట్సాప్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్..!


Mon,May 21, 2018 02:10 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. అదే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు లభిస్తుండగా, దీన్ని పూర్తి స్థాయిలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తున్నది.

అయితే ఈ ఫీచర్‌ను పొందాలంటే యూజర్లు ఎప్పటిలాగే వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఎవరైనా ఒక యూజర్‌ను ఎంచుకుని వీడియో కాల్ చేయాలి. అనంతరం స్క్రీన్‌పై యాడ్ పార్టిసిపెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే మరో యూజర్‌ను గ్రూప్ వీడియో కాలింగ్‌లోకి ఆహ్వానించవచ్చు. ఆ రిక్వెస్ట్‌ను అవతల ఉన్న యూజర్ యాక్సెప్ట్ చేస్తే అతను కూడా గ్రూప్ వీడియో కాల్‌లో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్విటేషన్ బేసిస్‌లో కాక కొందరు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే లభిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో యూజర్లు ఎవరైనా తాము వాడుతున్న వాట్సాప్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే దాంతో ఈ ఫీచర్ వారికి లభిస్తుందో లేదో తెలిసిపోతుంది. ఆండ్రాయిడ్‌లో అయితే వాట్సాప్‌ను 2.18.145 వెర్షన్‌కు, ఐఓఎస్‌లో అయితే 2.18.52 వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

4787

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles