దీని దుంప తెగ‌.. వాట్సాప్ గోల్డ్ అట‌, మ‌ళ్లీ వ‌చ్చేసింది..!


Mon,January 7, 2019 07:00 PM

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌. 2016లో వాట్సాప్ గోల్డ్ పేరిట ఓ న‌కిలీ మెసేజ్‌, యాప్ విస్తృతంగా వైర‌ల్ అయ్యాయి తెలుసు క‌దా. ఇప్పుడ‌దే వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మ‌ళ్లీ వాట్సాప్‌లో వైర‌ల్ అవుతున్న‌ది. అప్ప‌ట్లో ఆ మెసేజ్‌లో కేవ‌లం న‌కిలీ వాట్సాప్ గోల్డ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని మాత్ర‌మ మెసేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మెసేజ్‌లో అలా కాదు. అందులో martinelli పేరిట ఓ వీడియో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే చాలు.. 10 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మ‌రోసారి వైర‌ల్ అవుతోంది. కాబ‌ట్టి ఈ మెసేజ్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వాట్సాప్‌లో వ‌చ్చే ఏ మెసేజ్‌నైనా ఓపెన్ చేసే ముందు ఒక‌సారి ఆలోచించాల‌ని వారు సూచిస్తున్నారు. లేదంటే ఎంతో విలువైన మీ స‌మాచారం హ్యాక‌ర్ల బారిన ప‌డుతుందని వారు అంటున్నారు.6586

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles