ఐఫోన్ వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్..!


Sun,January 21, 2018 12:56 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై వాడే యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ వల్ల వాట్సాప్‌లో పంపుకునే యూట్యూబ్ వీడియో లింక్‌లను ఓపెన్ చేయగానే వీడియో అందులోనే ప్లే అవుతుంది. వాట్సాప్ యాప్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదు. ఓ వైపు వీడియో చూస్తూనే మరో వైపు వాట్సాప్‌లో చాటింగ్ చేయవచ్చు. ఐఓఎస్ వాడుతున్న యూజర్లు ఇప్పుడు ఈ ఫీచర్‌ను వాట్సాప్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ అవడం ద్వారా పొందవచ్చు. కొత్త వెర్షన్ వాట్సాప్ అప్‌డేట్ యాపిల్ యాప్ స్టోర్‌లో ఇప్పుడు ఐఓఎస్ యూజర్లకు లభిస్తున్నది. అయితే ఈ ఫీచర్ మిగిలిన ప్లాట్‌ఫాంలపై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ వెల్లడించలేదు.

1675

More News

VIRAL NEWS

Featured Articles