వాట్సాప్ ఐఫోన్ వెర్షన్‌లో కొత్త ఫీచర్లు..!


Mon,July 17, 2017 06:11 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఈ మధ్యే ఎనీ ఫైల్ షేర్ పేరిట ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లు ఏ ఫైల్‌నైనా సులభంగా షేర్ చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఇదే ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు కూడా లభిస్తున్నది. ఐఫోన్ యూజర్లు తమ వాట్సాప్ యాప్‌ను 2.17.40 వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే చాలు, దీంతో ఐఫోన్ యూజర్లు కూడా తమ వాట్సాప్ యాప్‌లో ఏ ఫైల్‌నైనా షేర్ చేసుకోవచ్చు.

ఇక కేవలం ఈ ఫీచర్ మాత్రమే కాకుండా వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే... ఒకటి పిన్డ్ చాట్. వాట్సాప్‌లో యూజర్లు తమ ఫేవరెట్ కాంటాక్ట్‌లను పిన్డ్ చేసి ఉంచితే అవి పై భాగంలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఇతర ఏ యూజర్ నుంచి మెసేజ్‌లు వచ్చినా అవి పిన్డ్ చాట్స్ కిందకు వెళ్తాయి. ఇక మరో ఫీచర్ ఏమిటంటే.. గ్రూప్ ఆల్బమ్స్. వాట్సాప్‌లో ఎవరైనా యూజర్లు అవతలి వ్యక్తులకు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఫొటోలు పంపితే అవి అవతలి వారికి సింగిల్ ఫొటోల్లా కనిపించవు. ఓ ఆల్బంలా కనిపిస్తాయి. ఇవన్నీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఐఫోన్‌లోనూ వాట్సాప్‌ను వాడుతున్న వారికి అందుబాటులోకి వచ్చాయి.

3085

More News

VIRAL NEWS