వాట్సాప్‌లో తెలుసుకోవాల్సిన ఫీచర్లు ఎన్నెన్నో


Thu,February 9, 2017 08:15 AM

నీలి రంగు టిక్స్‌ను తొలగించవచ్చు
వాట్సాప్ యాప్ నుంచి ఎవరికైన సందేశాన్ని పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది. సందేశాన్ని అవతలి వ్యక్తి మొబైల్‌కి చేరగానే రెండు టిక్స్ వస్తాయి. పంపిన సమాచారాన్ని చూడగానే రెండు టిక్స్ నీలి రంగులోకి మారుతాయి. కొన్ని సమయాల్లో సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలను దూరం చేసేందుకు ఈ యాప్ అవకాశాన్ని అందిస్తోంది. నీలి రంగు టిక్స్ రాకుండా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్, ప్రైవసీ, రీడ్ రిసిప్ట్స్‌ను ఆఫ్ చేస్తే చాలు. కానీ మనం ఇతరులకు పంపే సందేశాలకు సైతం నీలిరంగు టిక్స్ రావు.
మీ సందేశాన్ని ఎవరు చూశారో తెలుసుకోవచ్చు
సందేశాన్ని వేరే ఎవరికైనా పంపితే ఆ సందేశం అవతలి వ్యక్తి చూశారా లేదా అన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. మీరు పంపిన సమాచారానికి గంటల వరకు రిైప్లె ఇవ్వకపోతే యాప్ పని చేయట్లేదా లేదా నెట్‌వర్క్ సమస్యా అన్న సందేహం వస్తుంది. ఇలాంటి సందేశాలు రాకుండా మనం పంపిన సందేశంపై లాంగ్ ప్రెస్ చేసి పైన ఉన్న ఇన్ఫర్‌మేషన్ కీ(ఐ)ను నొక్కితే పూర్తి సమాచారం వస్తుంది. మీ సందేశం ఎప్పుడు చేరింది? వాళ్లు ఎప్పుడు చదివారో అన్న సమాచారం తెలిసిపోతుంది.
డేటా వాడకాన్ని తగ్గించవచ్చు
గ్రూపుల్లో వచ్చే అనవసరమైన ఫొటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వడం వల్ల డేటా అధికంగా వినియోగమవుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు వాట్సప్‌లో అవకాశం ఉంది. యాప్ సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మొబైల్‌లో ఏవీ డౌన్‌లోడ్ చేయాలో ఏవీ చేయకూడదో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు.
స్పేస్ తొలగించవచ్చు
వాట్సప్ ద్వారా చాటింగ్‌లు చేసేప్పుడు ఎంతమేర స్పేస్ వాడుతున్నామో తెలుసుకునే ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ యూసేజ్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ మనకు కావాల్సిన సందేశాలను, చిత్రాలను ఉంచి, అనవసరమైన వాటిని తొలగించడం ద్వారా స్పేస్‌ను తగ్గించుకోవచ్చును. అంతేకాకుండా ఎవరితో ఎక్కువ చాట్ చేస్తున్నారో అన్న విషయాన్ని సైతం తెలుసుకోవచ్చు.
చాట్‌ను హోమ్‌స్క్రీన్‌కు పంపవచ్చు
ఈ యాప్ ద్వారా ఎవరైన బాగా కావాల్సిన వ్యక్తి లేదా గ్రూపుచాట్‌ను హోం స్క్రీన్‌పై వచ్చేలా చేయవచ్చు. చాట్‌న్ పట్టుకుని హోమ్ స్క్రీన్‌పైకి తీసుకెళ్లడం ద్వారా చాట్‌కి షార్ట్‌కట్‌గా హోమ్ స్క్రీన్‌పై లిస్ట్‌పై కనిపిస్తుంది.
కస్టమైజ్ నోటిఫికేషన్స్
కావాల్సిన చాట్‌ను హోం స్క్రీన్‌పై ఏర్పాటు చేసుకున్నట్లుగానే, చాటింగ్ చేసే వారికి ప్రత్యేక నోటిఫికేషన్స్ కూడా ఇవ్వవచ్చు. చాట్‌పైన ఉన్న బార్‌ని నొక్కి కస్టమ్ నోటిఫికేషన్స్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
సందేశాన్ని ఇతర ఫార్మట్లో పంపొచ్చు
యాప్‌లో సందేశాలను పంపుతున్న వారు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలలో మాత్రమే పంపడం తెలుస్తుంది. కానీ బోల్డ్, ఇటాలిక్ ఫార్మట్లలో కూడా పంపవచ్చును. దీనికి గాను *....* సందేశాన్ని స్టార్ల మధ్యలో పంపితే బోల్డ్‌లో వస్తుంది. _...._ ల _మధ్య సందేశాన్ని పంపితే ఇటాలిక్‌లో వస్తుంది. పంపిన సందేశాన్ని కొట్టేయాలంటే ~....~ ల ~ మధ్య సమాచారాన్ని పంపితే కొట్టివేయబడుతుంది.
సందేశాన్ని టైపు చేయాల్సిన అవసరం లేదు
ఈ ఆప్షన్ కేవలం ఐవోఎస్-10లో మాత్రమే ఉంటుంది, ఇతర ఆండ్రాయిడ్ మోబైల్‌లకు వర్తించదు. మీకు స్కాటిష్ మాట్లాడడం రాకపోయిన మీరు మాట్లాడే భాషను అర్ధం చేసుకుని సందేశం రూపంలో టైప్ చేసి పంపుతుంది.
స్టార్ సందేశాలు
జీ మెయిల్‌లో ముఖ్యమైన సందేశాన్ని ఎలాగైతే స్టార్‌తో గుర్తిస్తామో అదే విధంగా వాట్సప్‌లోనూ స్టార్‌తో మార్క్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన సందేశంపై లాంగ్‌ప్రెస్ చేసి పట్టుకుంటే పైన వచ్చిన స్టార్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే సందేశం భద్రపరచబడుతుంది. తిరిగి ఆ సందేశాన్ని చూడాలనుకుంటే వాట్సప్‌లో మెయిన్ మెనూలో స్టెర్రడ్ సందేశాలలో చూసుకోవచ్చు.
సందేశాన్ని అన్‌రీడ్‌గా మార్చవచ్చు
ఒక సందేశం వచ్చినప్పుడు దాన్ని చూసి తిరిగి సమాధానం ఇచ్చే తీరిక లేని వేళలో ఈ ఆప్షన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూసిన సందేశాన్ని చూడనట్టుగా చేసే అవకాశం అందిస్తుంది. దీని కోసం సందేశంపై లాంగ్‌ప్రెస్ చేసి మార్క్ ఆజ్ అన్‌రీడ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఐవోఎస్ యూజర్స్ మాత్రం సందేశాన్ని ఎడమ నుంచి కుడివైపునకు స్వైప్ చేస్తే సరిపోతుంది.
మాస్-మెసెజ్ కాంటాక్ట్స్
ఒక మెసేజ్ చాలా మందికి ఈ-మెయిల్‌లో ఎలాగైతే పంపుతామో వాట్సాప్‌లో కూడా అలాగే పంపే అవకాశం ఉంది. దీనికోసం మెయిన్ మెనూలో న్యూ బ్రాడ్‌కాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే కావాలిసినన్ని కాంటాక్ట్స్‌కి సందేశాన్ని పంపించవచ్చు.
ప్రివ్యూలను హైడ్ చేయండి
ప్రైవసీ కావాలనుకున్న వారికి ఈ ఆప్షన్ చక్కగా ఉపకరిస్తుంది. పర్సనల్ చాటింగ్‌లు చేసుకునే వారి మొబైల్‌ను వేరే వాళ్లు..చూస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఐవోఎస్ వినియోగదారులు సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్, షో ప్రివ్యూని క్లిక్ చేస్తే కేవలం పేరు మాత్రమే డిసిప్లే అవుతుంది. అంతేగానీ వచ్చిన సందేశం కనిపించదు. ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఈ ఆప్షన్ వర్తించదు. కానీ మీ నోటిఫికేషన్లలో ఎలాంటి సమాచారం కనిపించాలో అనేది మీ మొబైల్ మెయిన్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి ఎంచుకోవాలి.
వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో వాడుకోవచ్చు
ఉద్యోగస్థులకు ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి సారి మొబైల్ ఫోన్లో వాట్సాప్‌ను వినియోగించడం ద్వారా మీతో పాటు ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమయంలో మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌కు అనుసంధానం చేసుకుని వాడుకోవచ్చు. దీని కోసం వెబ్ వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసిన అనంతరం మొబైల్‌లోని మెనూలో వెబ్ వాట్సప్‌పై క్లిక్ చేస్తే డెస్క్‌టాప్ పై వచ్చే బార్‌కోడ్‌ను మొబైల్ ఆక్టివేట్ చేసుకోవడం ద్వారా డెస్క్‌టాప్‌పై వాట్సాప్ తెరచుకుంటుంది.
చాటింగ్ డేటాను మెయిల్‌కు పంపుకోవచ్చు
మీరు చేసే చాటింగ్‌ను ఈ-మెయిల్‌కు పంపుకునే అవకాశం ఈ యాప్ అందిస్తుంది. చాట్‌ను మీడియాకు అటాచ్ చేయాలా? వద్దా అన్న ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ చాట్ మెనూలో మోర్ ఆప్షన్‌ను క్లిక్ చేసి ఈమెయిల్‌ను క్లిక్ చేస్తే చాలు.. చాట్ లిస్ట్ అంత మెయిల్‌కు అటాచ్ అవుతుంది.

3932

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles