వొడాఫోన్ కొత్త ప్లాన్... రూ.159 కే రోజూ 1జీబీ డేటా..!


Sun,August 26, 2018 06:04 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.159 కి అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే దాంతో వారికి రోజూ 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే వారానికి ఈ పరిమితి 1000 నిమిషాల వరకు ఉంటుంది. జియోలో ఉన్న రూ.149 ప్లాన్‌కు పోటీగా వొడాఫోన్ ఈ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. జియో రూ.149 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులే కావడం విశేషం.

8537

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles