రూ.999కే వొడాఫోన్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. రూ.20వేల బెనిఫిట్స్..!


Thu,November 7, 2019 02:13 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ తన పోస్ట్‌పెయిండ్ కస్టమర్ల కోసం వొడాఫోన్ రెడ్‌ఎక్స్ పేరిట ఓ నూతన లిమిటెడ్ ఎడిషన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.999 రెంటల్‌తో ఈ ప్లాన్ కస్టమర్లకు లభిస్తుండగా, ప్రస్తుతం ఉన్న వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు కూడా ఈ ప్లాన్‌కు అర్హులేనని ఆ కంపెనీ తెలిపింది. ఇక ఇందులో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, నెలకు 150జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ పొందిన కస్టమర్లు 50 శాతం ఎక్కువ స్పీడ్‌తో నెట్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వీలుంటుంది.

వొడాఫోన్ రెడ్‌ఎక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకే అందివ్వనున్నారు. అయితే వొడాఫోన్ రెడ్ కస్టమర్లతోపాటు ఇతరులు కూడా ఈ ప్లాన్‌ను ప్రీఆర్డర్ చేయవచ్చు. కానీ ఎంపిక చేసిన వారికే దీన్ని అందిస్తారు. ఈ నెల 25వ తేదీ తరువాత ఈ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఇక ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, వొడాఫోన్ ప్లే తదితర యాప్‌లకు బండిల్డ్ యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్లను పొందవచ్చు. దీంతోపాటు రూ.2999 విలువైన రోమింగ్ ప్యాక్‌ను ఈ ప్లాన్‌లో ఉచితంగా అందిస్తున్నారు. అలాగే రూ.20వేల విలువైన ప్రయోజనాలను ఈ ప్లాన్‌తో కస్టమర్లు పొందవచ్చు.

1761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles