వొడాఫోన్ యూత్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.499కే అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్


Thu,July 5, 2018 04:26 PM

వొడాఫోన్ ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్నారా? మీ వ‌య‌స్సు 18 నుంచి 24 సంవ‌త్స‌రాలు ఉంటుందా..? అయితే మీకు వొడాఫోన్ బంప‌ర్ ఆఫ‌ర్ ను అందిస్తున్న‌ది. రూ.499కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. వినియోగ‌దారులు మై వొడాఫోన్ యాప్‌లోకి వెళ్లి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ల‌భిస్తుంది. కేవ‌లం భార‌త్‌లో ఉన్న వొడాఫోన్ నెట్‌వ‌ర్క్‌ను వాడే యువ‌తీ యువ‌కుల కోస‌మే ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. యూత్ ఆఫ‌ర్ ఆన్ అమెజాన్ ప్రైమ్ కింద ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు.

2286

More News

VIRAL NEWS