కేదార్‌నాథ్‌లో 4జీ సేవలను ప్రారంభించిన వొడాఫోన్


Wed,June 13, 2018 07:48 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ కేదార్‌నాథ్‌లో 4జీ సేవలను ఇవాళ ప్రారంభించింది. చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయం సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత నాణ్యతతో కూడిన వాయిస్ కాల్స్, డేటా సేవలను అందించేందుకు 4జీ సేవలను ప్రారంభించామని వొడాఫోన్ యూపీ వెస్ట్ బిజినెస్ హెడ్ దిలీప్ కుమార్ గంటా వెల్లడించారు. కాగా వొడాఫోన్ గతంలో 500కు పైగా కొండ ప్రాంతాల్లో 4జీ సేవలను ప్రారంభించిన విషయం విదితమే. వాటిల్లో డెహ్రాడూన్, హరిద్వార్, తెహ్రి, నైనిటాల్ తదితర ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి కేదార్‌నాథ్ వచ్చి చేరింది. అలాగే ఉత్తరాఖండ్‌లో 4జీ సేవల కోసం రూ.300 కోట్లను వెచ్చించినట్లు దిలీప్ కుమార్ వెల్లడించారు.

2121

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles