వొడాఫోన్ వినియోగదారులకు కొత్త ప్లాన్..!


Wed,November 22, 2017 04:59 PM

వొడాఫోన్ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.349 పేరిట ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు రోజుకు 1.5జీబీ ఉచిత మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. కాగా ఎయిర్‌టెల్‌లో కూడా రూ.349 ప్లాన్ అందుబాటులో ఉండగా, అందుకు పోటీగా వొడాఫోన్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అంతకు ముందు వొడాఫోన్ రూ.458, రూ.509 ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. వీటి వాలిడిటీ వరుసగా 70 రోజులు, 84 రోజులుగా ఉంది.

2915

More News

VIRAL NEWS