జియోకు పోటీగా 5 కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన వొడాఫోన్..!


Sat,December 2, 2017 12:23 PM

వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు శుభవార్త. ఆ నెట్‌వర్క్‌ను వాడుతున్న వినియోగదారుల కోసం జియోలో ఉన్న ప్లాన్లలో లభించే బెనిఫిట్స్ మాదిరిగానే వొడాఫోన్ 5 కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. సూపర్ ప్లాన్స్ పేరిట వొడాఫోన్ వీటిని తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.79, రూ.199, రూ.347, రూ.458, రూ.509 టారిఫ్‌లలో ఈ ప్లాన్లు కస్టమర్లకు లభిస్తున్నాయి. వీటన్నింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. కాకపోతే వీటి ద్వారా లభించే డేటా, ఎస్‌ఎంఎస్‌లు ప్యాక్‌లు, వాలిడిటీ వేర్వేరుగా ఉన్నాయి.

* వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.79తో రీచార్జి చేసుకుంటే 500 ఎంబీ ఉచిత హై స్పీడ్ మొబైల్ డేటా లభిస్తుంది. వారు పంపుకునే ఒక్క ఎస్‌ఎంఎస్‌కు 25 పైసలు చార్జి పడుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులుగా ఉంది.

* రూ.199 ప్లాన్‌లో 1జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా ఒక్క ఎస్‌ఎంఎస్‌కు 25 పైసలు చార్జి పడుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

* రూ.347 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. ఒక్క ఎస్‌ఎంఎస్‌కు 25 పైసల చార్జి అవుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

* రూ.458 ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. వాలిడిటీ 70 రోజులు.

* రూ.509 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. వాలిడిటీ 84 రోజులు.

7217

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles