జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా వొడాఫోన్ ఐడియా మ్యూజిక్ యాప్..!


Fri,February 8, 2019 04:39 PM

ముంబై: భారత మార్కెట్లో రిలయన్స్ జియో జోరును తట్టుకొని నిలబడాలంటే ఆ సంస్థ అందిస్తున్న పలు వెరైటీ సర్వీసులను తమ కస్టమర్లకు అందించడానికి ఇతర పోటీ సంస్థలు వేగవంతం చేశాయి. రోజురోజుకీ జియో సంచలన నిర్ణయాలతో అన్ని రంగాల వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలను కొనుగోలు చేయడంతో పాటు మరికొన్ని వినూత్న యాప్‌లను తీసుకొస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల మ్యూజిక్ ప్రియుల కోసం మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ సావన్‌ను సొంతం చేసుకొని జియో సావన్‌గా మారిపోయింది. జియో కన్నా ముందే భారతీ ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ యాప్‌కు కలిగి ఉంది. ఈ రెండు సంస్థలకు పోటీగా తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది.

కస్టమర్లను ఆకర్షించడంలో ఫెయిల్ అయిన, ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐడియా మ్యూజిక్ యాప్‌ను నిలిపివేయనున్నారు. ప్రస్తుతం ఐడియా మ్యూజిక్ యాప్‌లో 3 మిలియన్ల పాటలున్నాయి. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడలాంటే అత్యుత్తమ ఫీచర్లతో యాప్ ఉండాలని వొడాఫోన్ ఐడియా సంస్థ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. గానా, హంగామా, యాపిల్ మ్యూజిక్, గూగుల్ మ్యూజిక్ యాప్‌లు అత్యంత ఆదరణ కలిగిన జాబితాలో ఉన్నాయి. ఐతే గానాతో ఒప్పందం చేసుకునేందుకు ఐడియా ఆసక్తి కనబరుస్తున్నట్లు ఒక అనలిస్ట్ చెప్పారు.

5087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles