అల్ రౌండర్ రీచార్జి ప్యాక్‌లను లాంచ్ చేసిన వొడాఫోన్ ఐడియా


Mon,September 24, 2018 08:43 PM

వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ పలు ఆల్ రౌండర్ రీచార్జి ప్యాక్‌లను ఇవాళ లాంచ్ చేసింది. వీటిల్లో టాక్‌టైం, మొబైల్ డేటాను కాంబోలో అందిస్తున్నారు. రూ.25 నుంచి రూ.245 మధ్యలో ఈ ప్యాక్‌ల ధరలు ఉన్నాయి.

రూ.25 ప్యాక్‌లో కస్టమర్లకు రూ.18 టాక్‌టైం (2.5పై/సెకనుకు), 10 ఎంబీ డేటా వస్తాయి.
రూ.35 ప్యాక్‌లో రూ.26 టాక్‌టైం (60పై/నిమిషానికి), 100 ఎంబీ డేటా వస్తాయి.
రూ.65 ప్యాక్‌లో రూ.65 టాక్‌టైం (60పై/నిమిషానికి), 200 ఎంబీ డేటా వస్తాయి.
రూ.95 ప్యాక్‌లో రూ.95 టాక్‌టైం (30పై/నిమిషానికి), 500 ఎంబీ డేటా వస్తాయి.
రూ.145 ప్యాక్‌లో రూ.145 టాక్‌టైం (30పై/నిమిషానికి), 1జీబీ డేటా వస్తాయి.
రూ.245 ప్యాక్‌లో రూ.245 టాక్‌టైం (30పై/నిమిషానికి), 2 జీబీ డేటా వస్తాయి.

కాగా రూ.25, రూ.35, రూ.65, రూ.95 ప్యాక్‌ల వాలిడిటీ 28 రోజులు ఉండగా, రూ.145, రూ.245 ప్యాక్‌ల వాలిడిటీ వరుసగా 42, 84 రోజులుగా నిర్ణయించారు. అయితే ఈ ప్యాక్‌లు తమిళనాడు సర్కిల్ వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగిలిన సర్కిళ్లకు చెందిన వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు.

6599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles