వివో జ‌డ్‌3ఐ స్టాండ‌ర్డ్ ఎడిష‌న్ విడుద‌ల


Mon,January 14, 2019 01:25 PM

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న జ‌డ్‌3ఐ స్మార్ట్‌ఫోన్‌కు గాను స్టాండ‌ర్డ్ ఎడిష‌న్ వేరియెంట్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. రూ.20,900 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నది. ఇందులో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఏఐ బ్యూటీ, బ్యాక్ లైట్‌, ప‌నోర‌మా, పోర్ట్రెయిట్ బ్యాక్‌గ్రౌండ్ బ్ల‌ర్ వంటి ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు.

వివో జ‌డ్‌3ఐ స్టాండ‌ర్డ్ ఎడిష‌న్ ఫీచ‌ర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, మీడియాటెక్ హీలియో పి60 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles