వివో నుంచి జడ్3 స్మార్ట్‌ఫోన్


Tue,October 23, 2018 10:00 AM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్3 ని చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి అక్కడ ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,980 ధరకు లభ్యం కానుండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.20,710 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.24,420 ధరకు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్‌ను త్వరలో భారత్‌లోనూ లాంచ్ చేయనున్నారు.

వివో జడ్3 స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 670 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 12, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను వెనుక భాగంలో అమర్చారు. ముందు భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.

వివో జడ్3 ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ.

1532

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles