వివో వై95 స్మార్ట్‌ఫోన్ విడుదల


Tue,November 13, 2018 07:07 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై95 ను మలేసియా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 6.22 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. రూ.19,190 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

వివో వై95 ఫీచర్లు...

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

4733

More News

VIRAL NEWS