ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన వివో వై93 స్మార్ట్‌ఫోన్


Sat,November 3, 2018 02:27 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై93 ని తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ కలర్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ రూ.15,890 ధరకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. వివో వై93 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయగా దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు.

వివో వై93 ఫీచర్లు...


6.22 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

3554

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles