ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడులైన వివో వై91 స్మార్ట్‌ఫోన్


Thu,January 17, 2019 02:50 PM

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై91ను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వై సిరీస్‌లో వ‌చ్చిన మిడ్ రేంజ్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇక ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయ‌గా, డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ల‌ను అందిస్తున్నారు. 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఈ ఫోన్ లో అమ‌ర్చారు.

వివో వై91 ఫోన్ స్టార్రీ బ్లాక్‌, ఓషియ‌న్ బ్లూ క‌ల‌ర్ ఆప్షన్ల‌లో రూ.10,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ సంద‌ర్భంగా ఈ ఫోన్‌పై ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. జియో రూ.4వేల విలువైన 3 టీబీ డేటాను ఉచితంగా అందిస్తున్న‌ది. అలాగే ఎయిర్‌టెల్ రూ.2వేల విలువైన 240 జీబీ డేటాను ఇస్తున్న‌ది. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.500 అద‌న‌పు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

వివో వై91 ఫీచ‌ర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles