వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌


Tue,January 22, 2019 02:58 PM

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై89 ను చైనా మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను ఇందులో ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. రూ.14,660 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు వ‌చ్చే వారం నుంచి ల‌భ్యం కానుంది.

వివో వై89 ఫీచ‌ర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 626 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1385

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles