ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన వివో వై83 స్మార్ట్‌ఫోన్


Sat,June 2, 2018 09:31 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వై83' ని తాజాగా విడుదల చేసింది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే విడుదలైన ఈ ఫోన్ రూ.14,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.22 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఉన్న 13 మెగాపిక్సల్ కెమెరాతో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

వివో వై83 ఫీచర్లు...

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

5246

More News

VIRAL NEWS