వివో నుంచి వై83 స్మార్ట్‌ఫోన్


Sun,May 27, 2018 01:26 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై83 ని చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 6.22 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. రూ.15,890 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

వివో వై83 ఫీచర్లు...

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

2087

More News

VIRAL NEWS